శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళలకు అనుమతి ఇచ్చిన కేరళ ప్రభుత్వం.

0
98

శబరిమల అయ్యప్ప ఆలయం ఇవాళ సాయంత్రం తెరుచుకోనుంది. దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్‌ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్‌ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.దీంతో రేపటి నుంచి అయ్యప్ప భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. దీంతో నీలక్కల్ బేస్ క్యాంప్ వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించారు. మహిళలు కూడా అయ్యప్ప దర్శనానికి రానుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని స్పష్టం చేసింది.