రైలు ప్రయాణికులకు అందించే ఆహార పదార్థాల ధరలను IRCTC పెంచింది. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఆహార పదార్థాల ధరలను పెంచినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో టీ ధర రూ.6, టిఫిన్ రూ.7, భోజనం ధర రూ.15 మేర పెరిగాయి. ఇక సెకండ్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీ, చైర్ కార్ బోగీల్లో టీ ధర రూ.5, టిఫిన్ రూ.8, భోజనం ధర రూ.10 మేర పెరిగాయి. 350 గ్రాముల స్నాక్స్ ప్యాకెట్‌ను రూ.50కి అందించనున్నారు.
పెరిగిన ధరలు 15 రోజుల్లో అమల్లోకి వస్తాయని ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. అంతేకాదు ఆయా రైళ్లలో ఇకపై ప్రాంతీయ భోజనాలు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది. రైళ్లలో టీ, టిఫిన్, భోజనం రేట్లు పెరగడంతో టికెట్ ధరలు పెరగనున్నాయి. టీ, టిఫిన్, స్నాక్స్, భోజనం ధరలను కలుపుకొనే ఈ రైళ్లలో టికెట్ ధర ఉంటుందన్న విషయం తెలిసిందే.