సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే…

0
52

జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే…  సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.30కి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దగ్గరుండి జరిపించారు. సుప్రీంకోర్టులో ఎంతో మంది జడ్జిలు ఉన్నా… బాబ్డేను తన వారసుడిగా చేయమని ప్రతిపాదించారు నిన్నటి వరకూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న రంజన్ గొగోయ్. ఎందుకంటే… గొగోయ్ తర్వాత… బాబ్డేనే… సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి. CJIగా బాబ్డే… 18 నెలలు పనిచేసి… ఏప్రిల్ 23, 2021లో రిటైర్మెంట్ తీసుకుంటారు.

1956 ఏప్రిల్ 24న నాగపూర్‌లో జన్మించిన జస్టిస్ బాబ్డే (63)… గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి… నాగపూర్ యూనివర్శిటీ నుంచీ లా డిగ్రీ తీసుకున్నారు. 1978లో ఆయన మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యారు. 1998లో సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు.