మన తెలుగు రాష్ట్రాల్లో లాగే మధ్యప్రదేశ్… ఇండోర్‌లో కూడా ట్రాఫిక్ జామ్ బాగా పెరిగిపోయింది. MBA చదువుతున్న షుబి జైన్… ఈ ట్రాఫిక్‌కి తనదైన స్టైల్‌లో చెక్ పెట్టింది. ప్రజల్లో ట్రాఫిక్, రోడ్డు రూల్స్‌పై అవగాహన కల్పిస్తూ… టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. డాన్స్ స్టెప్స్ వేస్తూ ట్రాఫిక్‌ని ఆమె కంట్రోల్ చేస్తుండటం విశేషం. తన ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఆమె… వాలంటీర్‌గా ట్రాఫిక్ కంట్రోల్ మొదలుపెట్టింది. మన దేశానికే చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజీత్ సింగ్… ఫ్రెడ్డిల్ మెర్క్యురీ డాన్స్ స్టైల్‌తో ట్రాఫిక్ జామ్‌ని కంట్రోల్ చేస్తుంటారు. ఆయన్ని ప్రేరణగా తీసుకున్న షుబీ కూడా… అదే రూట్ ఫాలో అయ్యింది. రకరకాల స్టెప్స్ వేస్తూ… ట్రాఫిక్ సజావుగా వెళ్లిపోయేలా చేసింది. ఎప్పుడూ లేనిది ఓ అమ్మాయి… ఇలా చేస్తుండటంతో… వాహనదారులు ఆశ్చర్యపోతూ… అవగాహన పెంచుకుంటూ ముందుకుసాగారు.