ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబుకు సంబంధించిన రామా నాయుడు స్టూడియోతో పాటు సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ ఈ రోజు ఉదయం నుంచి దాడులు మొదలుపెట్టింది. గత కొన్నేళ్లుగా రామానాయుడు స్టూడియోకు సంబంధించి సరైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహించినట్టు చెబుతున్నారు. ఈ సోదాల్లో సురేష్ బాబు కార్యాలయాల్లోని కొన్ని కీలక పత్రాలను హార్ట్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం సురేష్ బాబు.. వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా ‘వెంకీ మామ’ సినిమా తెరకెక్కిస్తున్నారు. దాంతో పాటు పలు సినిమాలను డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. అటు సురేష్ బాబుకు సంబంధించిన కార్యాలయాలతో పాటు పలువురు హీరోలు, నిర్మాతలు,దర్శకుల ఇళ్లపై ఐటీ దాడులు కొనసాగుతున్నట్టు సమాచారం.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -