‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాని నిలిపివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు.

0
31

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తోనే వివాదాల్లో నిలిచింది. ఈ సినిమా పేరు ఒక కులం వాళ్లను కించ పరిచేలా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ సినిమాలో ఏపీలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలను తక్కువ చేసేలా ఉందన్నారు. తాజాగా ఈ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు.. ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడని  కేఏ పాల్ ఆరోపించారు. అంతేకాదు ఈ నెల 29న విడుదల కానున్న ఈ సినిమాను నిలుపుదల చేయాలని  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేట్లో ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.