కనీరు తెప్పించిన జార్జ్ రెడ్డి మూవీ రివ్యూ..

0
39

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి.. జీవితం ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జార్జ్ రెడ్డిలో ముఖ్యంగా 1960, 70లలో యూనివర్సిటీలో జరిగిన కొన్ని సంఘటనలను చర్చించనున్నారు. గతంలో ‘దళం’ అనే సినిమాను తీసిన జీవన్‌ రెడ్డి  ఈ సినిమాను దర్శకత్వం వహించాడు.  టైటిల్ రోల్‌లో వంగవీటి ఫేం సందీప్‌ మాధవ్‌ నటించాడు.  ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్, ‘‘సిల్లీ మాంక్స్ స్టూడియో’’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సందీప్‌ మాధవ్‌‌తో పాటు ఈ సినిమాలో మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి మిగిత పాత్రల్లో నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో హీరో సత్య దేవ్ నటించాడు. మరాఠి సినిమా ‘సైరాత్’ కు ఫొటోగ్రఫీని అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు పనిచేశాడు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవుతోంది. అయితే అటు ఓవర్సీస్, ఇటూ ఇండియాలో కూడా ప్రీమియర్స్ పడడంతో టాక్ బయటకు వచ్చింది. సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికల్లో తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.