ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి.. జీవితం ఆధారంగా తెరకెక్కింది ఈ చిత్రం. ఈ సినిమా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జార్జ్ రెడ్డిలో ముఖ్యంగా 1960, 70లలో యూనివర్సిటీలో జరిగిన కొన్ని సంఘటనలను చర్చించనున్నారు. గతంలో ‘దళం’ అనే సినిమాను తీసిన జీవన్ రెడ్డి ఈ సినిమాను దర్శకత్వం వహించాడు. టైటిల్ రోల్‌లో వంగవీటి ఫేం సందీప్ మాధవ్ నటించాడు. ఈ సినిమాను మైక్ మూవీస్ బ్యానర్‌తో కలిసి త్రీ లైన్స్, ‘‘సిల్లీ మాంక్స్ స్టూడియో’’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సందీప్ మాధవ్‌తో పాటు ఈ సినిమాలో మనోజ్ నందన్, చైతన్య కృష్ణ, శత్రు, వినయ్ వర్మ, తిరువీర్, అభయ్, ముస్కాన్, మహాతి మిగిత పాత్రల్లో నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో హీరో సత్య దేవ్ నటించాడు. మరాఠి సినిమా ‘సైరాత్’ కు ఫొటోగ్రఫీని అందించిన సుధాకర్ యెక్కంటి ఈ సినిమాకు పనిచేశాడు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవుతోంది. అయితే అటు ఓవర్సీస్, ఇటూ ఇండియాలో కూడా ప్రీమియర్స్ పడడంతో టాక్ బయటకు వచ్చింది. సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికల్లో తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -