మహారాష్ట్రలో బలపరీక్ష సంక్షోభంపై రేపు సుప్రీంకోర్టు తీర్పు

0
40

 మహారాష్ట్రలో సంక్షోభంపై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సీఎం ఫడ్నవీస్‌కి మెజార్టీ ఉందా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు… బలపరీక్ష జరపాలా వద్దా అనే అంశంపై తీర్పును రిజర్వులో పెట్టింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్…. తుషార్ మెహతా… మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదనీ, ఎన్నికల ముందు పొత్తులపై ఆయనకు అవగాహన ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి ఫడ్నవీస్ మధ్య సాగిన లేఖల వివరాల్ని సుప్రీంకోర్టుకు సమర్పించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ… ఫడ్నవీస్‌కు ఎలాంటి లేఖ రాశారు? తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని గవర్నర్‌కు ఫడ్నవీస్ ఏమని లేఖ రాశారో సుప్రీంకోర్టు పరిశీలించింది.