ఆమె ఆదర్శం..

0
90

ఎల్లప్పుడూ ప్రజలతోనే.. ప్రజా సేవలోనే వుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. ముచ్చటగా మూడు సార్లు తెరాస జెడ్పి చైర్ పర్సన్ గా ఎన్నిక కావడమే అందుకు నిదర్శనం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీలకు అతీతంగా ఆమెకు అభిమానులు వున్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఆమె ఎప్పుడు వెనుకాడ లేదు. మాజీ రవాణా శాఖా మంత్రి పట్నం మహేందర్రెడ్డి ని ఆమె వివాహం చేసుకున్నారు. సోమవారం రోజు సునీత మహేండెరెడ్డి జన్మదినం సందర్బంగా ప్రజా టైమ్స్ స్పెషల్ స్టోరీ. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని ఆమె నివాసంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ప్రభుత్వ సేవలను ప్రజలకి చేరువ చేసేందుకు సీఎం కెసిఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేసారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాస్త మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలుగా మారాయి. ఆ తర్వాత జరిగిన జెడ్పి ఎన్నికల్లో జెడ్పి చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి గ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు సార్లు, వికారాబాద్ జిల్లాలో మొదటి సరిగా విజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసారు సునీత మహేందర్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా మూడోసారి విజయం సాధించిన నేతగా పేరు సాధించారు ఆమె.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇష్టపడే ప్రజాప్రతి నిదురాలు ఆమె. ఆషాఢమాసం, తొలి ఏకాదశి మొదలు కుని అన్ని పండగల్లో ఆమె పాల్గొంటారు. అంతేకాదు ఆడపడుచులకు ఇష్టమైన బతుకమ్మ పండగ అంటే ఆమె ఎంతగానో ఇష్టపడతారు. మహిళలతో కలిసి బతుకమ్మ పండుగనాడు ఆడతారు. తాను ఏ పని చేసిన అందుకు వాళ్ళ అమ్మ ఆదర్శం అని ఎల్లప్పుడూ చెబుతుంటారు
సునీత మహేందర్రెడ్డి.

అంతేకాదు పల్లె ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలకు టాయిలెట్ వంటి సదుపాయం కల్పించిన ఘనత కూడా ఆమెదే. ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ విద్య రంగానికి తనవంతు కృషి చేస్తున్నారు. ఎక్కడ సమస్యలు వున్నా యిట్టె వచ్చి వాలిపోతారు. గ్రామాల అభివృద్ధికి ఆమె ప్రత్యేక దృష్టి సారించారు. కోట్లాది నిధులతో గ్రామీణ ప్రాంతాల అభివృధే ధ్యేయంగా విప్లవాత్మక మార్పులు చేపడుతున్నారు సునీత మహేందర్ రెడ్డి.