దక్షిణ కొరియాలో… కే-పాప్ సింగర్ గూ హర హఠాన్మరణం. విషాదంలో ఫ్యాన్స్‌

0
53

దక్షిణ కొరియాలో… కే-పాప్ సింగర్లలో 28 ఏళ్ల గూ హర హఠాన్మరణం అందర్నీ విషాదంలో ముంచేసింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని తన ఇంట్లోనే ఆమె శవమై కనిపించింది. ఇదివరకు ఈ సింగర్ అండ్ యాక్ట్రెస్… హర… కారా అనే గర్ల్ గ్రూప్‌లో సభ్యురాలిగా ఉంది. ఆదివారం సాయంత్రం ఆమె చనిపోయిన విషయం బయట ప్రపంచానికి తెలిసింది. ఐతే… ఆమె మరణానికి కారణం ఏంటన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆరు నెలల కిందట ఇలాగే అదే ఇంట్లో గూ హర… అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమె మేనేజర్‌… ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా… సూసైడ్ అటెంప్ట్ చేసిందని డాక్టర్లు తెలిపారు. ఆ తర్వాత కోలుకున్న ఆమె… తన ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెప్పింది. ఈమధ్య ఆమె సొంతంగా కెరీర్ ప్రారంభించి… జపాన్ టూర్ వేసింది. కొత్త సింగిల్ కూడా రిలీజ్ చేసింది.

గూ హర జీవితం గతేడాది అగమ్యగోచరంగా తయారైంది. అందుకు కారణం ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్. ఆమెతో సెక్స్ చేసిన అతడు… సీక్రెట్‌గా వీడియో తీశాడు. ఆ వీడియోను బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చెయ్యడంతో… ఆమె అతనిపై కంప్లైంట్ ఇచ్చి… కోర్టు మెట్లెక్కింది. దక్షిణ కొరియాలో ఇలా చాలా మంది మోసగాళ్లు అమ్మాయిలను సీక్రెట్‌గా వీడియోలు తీస్తున్నారు. ఇలా తీసినవాటిని వెబ్‌సైట్లకు అమ్ముకుంటున్నారు. దీన్ని స్థానికంగా మోల్కా అని పిలుస్తున్నారు. ఈ విధానంపై చాలా మంది ఆందోళనలు చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.