రైతులకు రైతు భరోసా పథకం అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం… ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజా ఇందుకు సంబంధించి జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. రైతు భరోసా పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది. కౌలు రైతులతో పాటు అటవీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది. రైతు భరోసా నుంచి ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైతు సంతానం ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా కూడా రైతు భరోసా వర్తిస్తుందని జీవోలో పేర్కొంది. ఒక వేళ రైతు మరణిస్తే భార్యకు రైతు భరోసా సాయం అందించనుంది. ఆ తర్వాతి ఏడాది ఆ భూమి వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా ఇచ్చేలా మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -