టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులను వివిధ కారణాలతో ఆర్టీఏ అధికారులు సీజ్ చేయడం… తాడిపత్రిలో జేసీ ప్రధాన అనుచరుడు వైసీపీలో చేరడం జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది.
తాజాగా జేసీ ఫ్యామిలీకి మరో షాక్ తగిలింది. త్రిశూల్ సిమెంట్ కంపెనీకి లైమ్‌స్టోన్ మైనింగ్ లీజ్ మంజూరు విషయంలో జేసీ కుమారుడు పవన్ రెడ్డి, కోడలు సంయుక్తారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు త్రిశూల్ సిమెంట్ సంస్థలు, వ్యాపార భాగస్వామి వేణుగోపాల్ రెడ్డికి కూడా కోర్టు నోటీసులు ఇష్యూ చేసింది. ఈ కేసులో మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 30కు వాయిదా వేసింది.