ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యాడు విజయ్ దేవరకొండ. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. ‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో తన మార్కెట్ పరిధి పెంచుకున్నాడు. తాజాగా విడులైన ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు. అంతేకాదు రౌడీ బ్రాండ్ పేరుతో ప్రత్యేకంగా దుస్తులకు సంబంధించిన బ్రాండ్ క్రియేట్ చేసాడు. అంతేకాదు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అభిమానులను సంపాదించుకున్నాడు.

తాజాగా ఈ కధానాయకుడు ఓ ఇంటివాడయ్యాడు. మొన్నటి వరకు శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విజయ్ ఫ్యామిలీ..రీసెంట్‌గా ఫిల్మ్ నగర్‌లోని శ్రీకాంత్ ఇంటికి సమీపంలో ఉన్న కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యరు. దాదాపు రూ.20 కోట్లు పెట్టి ఈ ఇంటిని కొన్నట్టు సమాచారం. తాజాగా విజయ్ దేవరకొండ.. తన తల్లితండ్రులు, సోదరులతో కలిసి కలిసి ఈ ఇంట్లో శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేసాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేసాడు. ఈ చిత్రం వచ్చే యేడాది విడుదల కానుంది.