ఏపీ రాజధాని అమరావతిలో నిర్మాణాలను పరిశీలించేందుకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు బయల్దేరారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన ఆయన.. కాసేపట్లో అక్కడికి చేరుకోనున్నారు. ఆయన వెంట టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఉన్నారు. అయితే, బాబు పర్యటనను అడ్డుకుంటామని కొందరు రైతులు హెచ్చరించారు. రాజధాని కోసం తమవద్ద భూములు తీసుకొని ప్లాట్లు ఇవ్వలేదని, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటివి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దళిత రైతుల పట్ల పూర్తి నిరంకుశ వైఖరి కనబరచారని ఆరోపిస్తున్నారు. బాబు పర్యటనకు వ్యతిరేకంగా నల్ల జెండాలు, ఫ్లెక్సీలతో నినాదాలు చేస్తున్నారు. రైతులు రెండు వర్గాలుగా విడిపోయి వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లు రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. వారికి తోడుగా గో బ్యాక్ చంద్రబాబు అంటూ వైసీపీ వర్గీయులు నినాదాలు చేపట్టారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -