షాద్ నగర్ సమీపంలో ఓ యువతి సజీవ దహనం.

0
50

తెలంగాణలోని షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. నిన్న సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతి… ఉదయం సజీవ దహనమై ఉండటం సంచలనం రేపింది. మృతురాలు ప్రియాంక రెడ్డిగా గుర్తించారు. ట్రీట్ మెంట్ కోసం నిన్న సాయంత్రం మాదాపూర్ హాస్పిటల్‌కు వెళ్లిన ప్రియాంక… తిరిగి వచ్చే సమయంలో తన స్కూటీ పాడైపోయిందని చెల్లెలికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. తన స్కూటీ పాడైందని… చుట్టుపక్కల లారీ డ్రైవర్లు ఉన్నారని.. తనకు భయమేస్తోందని ఆమె తన చెల్లికి ఫోన్‌లో చెప్పినట్టు సమాచారం. రాత్రంతా ప్రియాంక ఇంటికి రాకపోవడంతో… ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్ నగర్ సమీపంలో ఓ యువతి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉందని గుర్తించిన పోలీసులు… మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు… ఆ డెడ్ బాడీ ప్రియాంక రెడ్డిదే అని గుర్తించారు.