తెలుగు రీమేక్‌లో ‘అసురన్’ హీరోగా వెంకటేష్.

0
58

ప్రస్తుతం సీనియర్ హీరో వెంకటేష్.. తన మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తమిళంలో ధనుశ్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘అసురన్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రియను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. గతంలో వీళ్లిద్దరు ‘సుభాష్ చంద్రబోస్, ‘గోపాల గోపాల’ సినిమాల్లో కలిసి యాక్ట్ చేసారు. అంతేకాదు వెంకటేష్ హీరోగా నటించిన ‘తులసి’లో ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసింది శ్రియ.ధనుశ్ హీరోగా నటించిన ‘అసురన్’లో హీరో, హీరోయిన్ పాత్రలతో పాటు  పవర్‌ఫుల్ విలన్ పాత్రలు మూడు ఉన్నాయి. తెలుగులో వాటిని ఎవరితో చేయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.