అన్నకు శుభాకాంక్షలు తెలిపిన సోదరి షర్మిల.

0
73

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి ఆరునెలలు పూర్తియ్యింది. ఈ సందర్భంగా ఆయనకు సొంత పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు మంత్రులు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ఈ సందర్భంగా జగన్ సోదరి షర్మిల కూడా ట్వీట్ చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో తన అన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మెసేజ్ పెట్టారు. ఆరెనెలలుగా ఏపీలో జగన్ చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల్ని ప్రస్తావిస్తూ షర్మిల ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా, ఫించన్ల పథకం, నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, మత్స్యకార పథకం, చదువుల విప్లవం, మద్యపాన నిషేధం ఇలా జగన్ ఈ ఆరునెలల కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాల్ని వీడియో రూపంలో షర్మిల ట్వీట్ చేశారు. ‘ఈ ప్రభుత్వానికి మీ చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని.. రాష్ట్ర ప్రగతికి నేను వేస్తున్న ప్రతి అడుగులో మీరంతా అండగా నిలవాలని కోరుకుంటున్నాను’ అంటూ తెలిపారు.