జైల్లో ఉన్నా.. బయట ఉన్నా.. బీజేపీపై విమర్శల పదును తగ్గించని చిదంబరం..

0
52

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో మాజీ కేంద్రమంత్రి చిదంబరం తీహార్ జైలు నుంచి బయటకొచ్చిన సంగతి తెలిసిందే. 106 రోజుల జైలు జీవితం తర్వాత విడుదలైన చిదంబరం పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా గురువారం రాజ్యసభకు హాజరయ్యారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే చిదంబరం రాజ్యసభకు వస్తారని బుధవారం ఆయన సతీమణి చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. చిదంబరం రాజ్యసభకు హాజరవుతారని చెప్పారు. మొత్తం మీద చిదంబరం రాజ్యసభకు హాజరవడం హాట్ టాపిక్‌గా మారింది. జైల్లో ఉన్నా.. బయట ఉన్నా.. బీజేపీపై విమర్శల పదును తగ్గించని చిదంబరం..

కాగా,ఐఎన్ఎక్స్ మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాడి అగస్టు 21న సీబీఐ చిదంబరంను అరెస్ట్ చేసింది.ఆ తర్వాత అక్టోబర్ 16న ఈడీ కూడా అదుపులోకి తీసుకుంది. అనంతరం తీహార్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు.ఇదే క్రమంలో సీబీఐ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. ఈడీ కేసు కూడా వెంటాడుతుండటంతో జైలు నుంచి విడుదల కాలేకపోయారు. అయితే బెయిల్‌ను తీసిపుచ్చుతూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును చిదంబరం సుప్రీంలో సవాల్ చేయడంతో ఎట్టకేలకు బయటకొచ్చారు.