‘దిశ’ అత్యాచారం తర్వాత ఫేస్బుక్లో ఆమెకు న్యాయం చేయాలని మద్దతుగా ఓ మహిళ పెట్టిన పోస్టుపై అసభ్యకర కామెంట్లు చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తన ఫేస్బుక్ ఖాతాలో అనిల్ కుమార్ అంబాలా డిసెంబర్ 1న ఈ కామెంట్ చేశాడని రాయదుర్గానికి చెందిన విజయా కేసరి అనే మహిళ ఈ నెల 2న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు ఫేస్బుక్ ఖాతా ఆధారంగా నిందితుడు నల్గొండ జిల్లా, గుండ్రంపల్లికి చెందిన అనిల్ కుమార్ అంబాలాగా గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -