గూడూరు లో రైలు ప్రమాదం.. టీవీ 9 విలేకర్ గోపి మృతి.

0
70

గూడూరులో జరిగిన రైలు ప్రమాదంలో టీవీ 9 విలేకర్ గోపి మృతి చెందారు. గోపి మృతితో విలేకర్లు దిగ్బ్రాంతికి గురైయ్యారు. నెల్లూరు జిల్లా గుడూరు పట్టణానికి చెందిన టీవీ 9 గోపి మృతి అందరి మనస్సులు కలిచి వేసింది. పలువురు గోపి గురించి మాట్లాడుతూ మంచికి మారుపేరుగా నిజాయితీ నిబద్దతతో పనిచేసే ఓ గొప్ప జర్నలిస్టుని కోల్పాయామన్నారు. టీవీ 9 లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ సీనియర్ జర్నిలిస్ట్ గా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. శుక్రవారం రాత్రి గూడూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని మృతి చెందారు.

ప్రమాదంలో మృతి చెందారా లేదా అనే విషయాన్ని పోలీసులు తేల్చాలి. మృతి చెందిన గోపి పార్థిమ దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేస్తున్నారు, గోపి అకాల మృతి పై జర్నలిస్టుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు పట్టణంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా || కోట సునీల్ కుమార్ స్వామి గారు గోపీ మృతి ఫై స్పందించారు. జర్నిలిస్ట్ లో ఓ మంచి వ్యక్తి గా పేరుతెచ్చుకున్న వ్యక్తి గోపన్న అంటూ గోపి ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుకున్నారు.