విదేశి భక్తు రాలీని మోసం చేసిన నిత్యానంద.

0
31

 మనుషుల్లో వీక్‌నెస్‌ని క్యాష్ చేసుకుంటూ… స్వయంగా దేవుళ్లం అని చెప్పుకునే వాళ్లు మన దేశంలో చాలామంది ఉన్నారు. వారిలో ఒకరు నిత్యానంద. ఓవైపు కర్ణాటక కోర్టులో నిద్యానందపై క్రిమినల్ కేసులు కొనసాగుతుంటే… మరో వైపు ఆ మహానుభావుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమాయకుల్ని తన భక్తులుగా చేర్చుకుంటూ బిజినెస్‌ను పెంచుకుంటున్నాడు. ఇండియాతోపాటూ… విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో డొనేషన్లు ఇస్తూ… అతన్ని దేవుడిగా మార్చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో రావడం… నిత్యానంద ఆశ్రమానికి వెళ్లడం, ఆయన చెప్పింది వినడం… ఆ తర్వాత ఆయన భక్తులుగా మారిపోయి… అన్నీ సమర్పించుకోవడం సహజమైపోతోంది. ఇటీవల నిత్యానంద ఆశ్రమ సిబ్బంది… యువతుల్ని బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగేందుకు చేసిన ఘనకార్యాలు వెలుగులోకి రావడంతో… ఒకప్పటి నిత్యానంద భక్తులు ఇప్పుడు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్రాన్స్‌కి చెందిన మాజీ భక్తురాలు నిత్యానందపై కేసు పెట్టింది. తన దగ్గర నుంచీ నిత్యానంద రూ.2,85,18,800 కాజేశాడని కేసులో తెలిపింది. దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించింది. మరో విదేశీయురాలు ఒకప్పుడు నిత్యానందను ఆకాశానికి ఎత్తింది. ఇప్పుడామె జ్ఞానోదయం అయినట్లు ఫీలవుతోంది. నిత్యానందకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తాననీ, ఆయన మోసాలన్నీ వెలుగులోకి తెస్తానని అంటోంది. ఒకప్పుడు నిత్యానంద గ్రూపులో ఉండి… టాప్ రిక్రూటర్‌గా పనిచేసిన సారా లిండే… ఇప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా… నిత్యానందపై నిప్పులు చెరుగుతున్నారు. అక్రమాలన్నీ బయటకు తెస్తున్నారు.