పవన్ కళ్యాణ్ కు షాక్ ఇచ్చిన జనసేన నేత.

0
31

ఇంగ్లీష్ మీడియంపై జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు పవన్ ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తుంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక మాత్రం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై గతంలో ఓ ప్రయత్నం చేశారన్నారు. మరి ఇప్పుడెందుకు చంద్రబాబు జగన్‌ను అడ్డుకుంటున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై ప్రభుత్వాన్ని సమర్ధించారు జనసేన ఎమ్యెల్యే రాపాక వరప్రసాద్. ఒకపక్క అధినేత పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రభుత్వాన్ని ఏకరువు పెడుతున్న సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా జేఎస్పీ ఎమ్యెల్యే రాపాక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.