సినీ ఇండస్ట్రీలో మరో విషాదం. ప్రముఖ కమెడియన్ తల్లి కన్నుమూత.

0
36

తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. రీసెంట్‌గా ప్రముఖ రచయత నటుడు గొల్లపూడి మారుతిరావు కాలం చేసి వారం కూడా కాలేదు. అపుడే టాలీవుడ్‌లో అలీ ఇంట్లో మరో విషాదకరణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ కమెడియన్ కమ్ యాంకర్ కమ్ హీరో ఆలీ తల్లి జైతున్ బీబీ తీవ్ర అనారోగ్యంతో ఆమె సొంత ఊరు రాజమండ్రిలో కన్నుమూశారు. ప్రస్తుతం అలీ ఓ షూటింగ్ నిమిత్తం రాంచీలో ఉన్నారు. తల్లి మరణవార్త తెలుసుకున్న అలీ హుటాహుటినా హైదరాబాద్ బయలు దేరారు. మరోవైపు అలీ తల్లి జైతున్ బీబీ పార్ధివ దేహాన్ని హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు అలీ బంధువులు. ఈ రోజు సాయంత్రం అలీ తల్లి అంత్య క్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.