ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఏపీకి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ విషయమై అమరావతి ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మిగతా ప్రాంత ప్రజలు జగన్ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతిని శాసన రాజధానిగా చేస్తే.. విశాఖను పాలన రాజధానిగా ప్రకటించారు. ఇక రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా కర్నూలును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా వైజాగ్ ఆర్ధిక రాజధాని అని మంత్రులు,కీలక నేతలు మాట్లాడటం కొంత మందికి కొత్త సమస్య తీసుకొచ్చిందట. అసలు విషయం ఏంటంటే.. గత ప్రభుత్వం అమరావతి రాజధాని ప్రకటించడంతో అక్కడి భూముల ధరలు అమాంతం పెరిగాయి. లక్షల్లో ఉన్న భూమి విలువ కోట్లకు పెరిగింది. దీంతో చాలా మంది పారిశ్రామిక వేత్తలు, సినీ నటులు అమరావతిలో ఉన్న భూములపై కోట్లలో ఇన్వెస్ట్ చేసారు. అందులో టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరో తన వాళ్ల చేత ఏకంగా 500 ఎకరాల భూములను కొనిపించాడట. తాజాగా జగన్ మూడు రాజధానుల ప్రకటనతో సదరు హీరో కొన్న భూముల విలువ సడెన్‌గా కోట్ల నుండి లక్షల్లోకి పడిపోయిందట. దీంతో సదరు స్టార్ హీరోకు ఏం చేయాలో పాలుపోవడం లేదని టాక్. ఈ విషయమే ఇపుడు ఏపీ సినీ,రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -