పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పిన రామ్ గోపాల్ వర్మ.

0
35

గతేడాది ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో టాలీవుడ్‌లో రచ్చ చేసిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా తన నిర్మాణంలో శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో ‘బ్యూటీఫుల్’ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను వర్మ జోరుగా చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ నైనా గూంగూలితో కలిసి డాన్స్ చేసి వర్మ రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ సినిమాకు హైప్ తీసుకురావడానికి వర్మ బ్యూటీఫుల్ హీరోయిన్ నైనా గంగూలి కాళ్లు పట్టుకున్న సంగతి తెలిసిందే కదా. ఈ రోజు  ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్మ.. పవన్ కళ్యాణ్‌కు బహిరంగ క్షమాపణలు కోరాడు. ఈ సందర్భంగా ఆర్జీవి మాట్లాడుతూ.. పవన్ గారికి తిక్కుంది.. నాకు లెక్కుంది.. కానీ లెక్కకన్నా.. తిక్కే అందరికీ నచ్చుతుంది. అందుకే ఆయన స్టార్ అయ్యాడు. నన్ను క్షమాపణ కోరాడు. ప్రమాణం చేసి చెబుతున్నా.. నాకు శ్రీదేవి కంటే పవన్ అంటేనే ఇష్టం. నేను దేవుడ్ని నమ్మను. మీరు నా మాటలు నమ్మకపోతే నేనేం చేయలేను అని వర్మ అన్నాడు. ఒక మహిళ తన కన్నా సక్సెస్‌ఫుల్ అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.