ఇక ఆర్జీవి నుంచి అద్భుతమనే రీతిలో సినిమాలు వస్తామయనుకోవడం అత్యాశే అవుతుంది.

0
50

రామ్ గోపాల్ వర్మ ఖేల్ ఖతం. ఇక ఆర్జీవి నుంచి అద్భుతమనే రీతిలో సినిమాలు వస్తామయనుకోవడం అత్యాశే అవుతుంది. ఇది మేముంటున్నది కాదు.. ఆయన అభిమానులే సోషల్ మీడియా వేదికగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. ‘శివ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో సంచలనానికి తెరలేపిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా తనదైన ముద్ర వేసి ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలను తెరకెక్కించిన సంచలన దర్శకుడు ఆర్జీవి. ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాలు అంటూ ఏకంగా పోర్న్ సినిమాలను కూడా వర్మ తీస్తున్నాడు.గత దశాబ్ద కాలంగా ఆయన చేసిన సినిమాలు అంటేనే ప్రేక్షకులు అయ్య బాబోయ్ అంటున్నారు. తన సినిమాలను కథా బలంతో కాకుండా.. వివాదాలతో సినిమాలకు పబ్లిసిటీ బాగా తెచ్చుకుంటున్నాడు. అంతేక తప్ప సినిమా లో కంటెంట్ ఉండటం లేదనుకుంటున్నారు ఆయన అభిమానులు. అలాగే రొమాంటిక్ సినిమాలు అంటూ ప్రచారం చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపడం తీరా సినిమా విడుదలైన తర్వాత నిరాశ పరచడం చాలా కామన్ అయిపోయింది.

కాని కొందరు మాత్రం వర్మ నుండి మునుపటి తరహాలో అద్బుతాలను ఆశించడం అతి అవుతుందని.. ఆయన సినిమాలు సక్సెస్ అవుతాయని ఆశించడం అత్యాశ అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా తన సినిమాల ప్రమోషన్ కోసం హీరోయిన్ కాళ్లు పట్టుకోవడం సహా ఎలాంటి పని చేయడానికైనా సై అంటున్నాడు. ముందు ముదు వర్మ నుండి రాబోతున్న సినిమాలు కూడా సక్సెస్ అవుతాయనే నమ్మకం లేదంటున్నారు. అంతేకాదు మళ్లీ గతంలో తీసినటువంటి ట్రెండ్ సెట్టర్ చిత్రాలను తీస్తాడనే నమ్మకం లేదంటూ వర్మ అభిమానులు ఒకింత అసహనంతో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.