చంద్రబాబుకు షాక్… అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీకి అనుమతి లేదన్న పోలీసులు.

0
51

తిరుపతి పోలీసులు టీడీపీకి, అధినేత చంద్రబాబుకు షాకిచ్చారు. శనివారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించే అమరావతి పరిరక్షణ ర్యాలీకి అనుమతి లేదంటున్నారు. సంక్రాంత్రి హడావిడి ఉందని.. కాబట్టి ర్యాలీకి అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఎవరైనా ర్యాలీకి ప్రయత్నిస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు నగరంలో పోలీసుల్ని భారీగా మోహరించారు.. పరిస్థితి ఎస్పీలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

అమరావతి పరిరక్షణ ర్యాలీ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. ఐతేపల్లిలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ ఛైర్మన్‌ నరసింహయాదవ్‌లు గృహ నిర్బంధంలో ఉన్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

చంద్రబాబు హైదరాబాద్ నుంచి శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఫ్లైట్‌లో బయలుదేరి మధ్నాహ్నం 2.10 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 3.15 గంటలకు తిరుపతి చేరుకొని.. పూలే విగ్రహం వద్దకు చేరుకుంటారు.. అక్కడి నుంచి నాలుగుకాళ్ల మండపం వరకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో పాల్గొంటారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పోలీసులు ర్యాలీకి అనుమతి లేకపోవడంతో అందరిలో ఉత్కంఠ రేపుతోంది