సంక్రాంతి అంటే… గోదావరి జిల్లాల్లో కనిపించే సందడి అంతా ఇంతా కాదు. ఓవైపు పండగ చేసుకుంటూ… పిండి వంటలు వండుకుంటూనే… మరోవైపు కోడిపందేలు, గుండాటలు, పేకాటలూ కొత్తగా కేసినోలు కూడా ఆడేస్తున్నారు. ఇవాళ్టి నుంచీ 4 రోజుల పాటూ… ఈ కోడి పందేలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రభుత్వం ఎప్పటిలాగే కోడి పందేలు నిర్వహిస్తే అరెస్టు చెయ్యమని ఆదేశించింది. ఇందుకు సంబంధించి కొన్ని కమిటీలు వేసింది. ఈ కమిటీల సభ్యులు… గోదావరి జిల్లాల్లో తిరుగుతున్నారు. ఆల్రెడీ కోడి కత్తులు ఎక్కడ కనిపించినా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. చిత్రమేంటంటే… ప్రతీ సంవత్సరం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఎంత పోలీసుల నిఘా ఉన్నా… నాలుగు రోజులపాటూ… కోడి పందేలు కొనసాగుతూనే ఉంటాయి.

భీమవరం లాంటి చోట్ల ఇవాళ్టి నుంచీ కోడి పందేలు నిర్వహిస్తున్నారు పందెం రాయుళ్లు. రేపు 14న భోగి పండుగ జరుగుతుంది కాబట్టి… పండగ రోజు కంటే ముందే కోడి పందేలు నిర్వహించాలని డిసైడయ్యారు. ఉదయం నుంచీ పందేలు జోరుగా సాగుతున్నాయి. బరులన్నీ పందెం రాయుళ్లు, కోడి పందేలను చూసేందుకు వచ్చే వారితో నిండిపోయాయి. ఇది వరకు వ్యవసాయ భూముల్లో కూడా బరులు నిర్వహించేవారు. ఈ సంవత్సరం కొత్త వైసీపీ ప్రభుత్వం అదనపు కండీషన్లు పెట్టడంతో… వ్యవసాయ భూముల్లో కాకుండా పోడు భూముల్లో బరులు ఏర్పాటు చేశారు. ఒక్కో బరికీ రూ.25 లక్షలకు పైగా చెల్లిస్తున్నారు.