కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోన్న ‘అల వైకుంఠపురములో’.

0
40

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్‌ దగ్గర అదరగొడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా రెండు రాష్ట్రాల్లోతోపాటు అటూ ఓవర్సీస్‌లో కూడా ఇరగదీస్తోంది. గతంలో ఈ ఇద్దరీ కాంబినేషన్‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చిన సంగతి తెలిసిందే. గత సినిమాల వలే ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో..

త్రివిక్రమ్, బన్నీ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారు. అయితే అమెరికా, న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌తో రచ్చ చేస్తోంది. ఆ రెండు దేశాల్లో ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి. ముఖ్యంగా న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కనివిని ఎరుగని కలెక్షన్స్‌ను రాబడుతోంది. అక్కడ మూడు ప్రదేశాల్లో విడుదలైన ఈ సినిమా ఐదు షోలకే 34,625 డాలర్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదని ఫిల్మ్ క్రిటిక్ రమేష్ బాలా అభిప్రాయపడ్డారు. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ప్రీమియర్ షోలకు న్యూజిల్యాండ్‌లో 21,290 డాలర్లు మాత్రమే రాబట్టాయి. మరోవైపు ఒకరోజు ముందే విడుదలైన సరిలేరు నీకెవ్వరు అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్ ని అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. అక్కడ ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది.