పవన్ కళ్యాణ్‌పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు.

0
25

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-జనసేన పొత్తుపై స్పందించిన ఆయన.. పవన్ కళ్యాణ్‌కు అధికారమే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఆయన పవర్ కోసమే పార్టీ పెట్టారని.. ఈ విషయాన్ని తాను 2019 ఎన్నికలకు ముందే చెప్పినా ఎవరూ నమ్మలేదన్నారు. శుక్రవారం తన ఫేస్‌బుక్ పేజీ లైవ్‌లో మాట్లాడిన ఆయన.. పవన్‌పై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను చూస్తే విచారంగా ఉందన్నారు పాల్. 2008లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడే కాంగ్రెస్ ఏజెంట్‌ని తాను చెప్పినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. తర్వాత పార్టీ పెట్టారు 18శాతం ఓటు బ్యాంక్ 18 ఎమ్మెల్యేలు వచ్చాయని.. ఓ ఎంపీ, మంత్రి పదవి కోసం చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు కూడా సార్వత్రిక ఎన్నికల్లో 5 నుంచి 6 శాతం కూడా ఓట్లు రావు.. ఆయన ఓడిపోతారని తానే ముందే చెప్పానన్నారు. కాపులే ఆయనకు ఓటు వేయలేదన్నారు.

పవన్ ఎన్నికలకు ముందు మాయావతి కాళ్లు పట్టుకున్నారని.. మాయవతి ప్రధాని.. ఆయన ముఖ్యమంత్రి అవుదామని భావించారని.. కానీ మోదీ అధికారంలోకి ఉన్నారని నడ్డా, అమిత్ షా కాళ్లు పట్టుకున్నారని విరుచుకుపడ్డారు. రైతులకు న్యాయం జరగాలన్నా.. యువతకు ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదా కావాలి.. ఎందుకు హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు చంద్రబాబుతో ఉండి.. ఆయన పలుకులు పలికి.. ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తు ఏంటని ప్రశ్నించారు. ప్రజలు అందుకే ఎన్నికల్లో నమ్మలేదని.. మెడ వంచకూడదు.. ఆడుక్కోకూడదు.. మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకుంటే రాష్ట్రానికి వచ్చేది ఏమీ లేదన్నారు. 2024లో ఎన్నికలు ఉంటే.. ఇప్పుడే పొత్తు ఎందుకో చెప్పాలన్నారు. జగన్‌పై నిందలు వేస్తున్నావ్.. ఆయన ముఖ్యమంత్రి.. ప్రతిపక్షంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనకు సపోర్ట్ చేయాలి అన్నారు.