టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్సార్‌సీపీకి సవాల్‌.

0
45

టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్సార్‌సీపీకి చేసిన సవాల్‌పై ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న చంద్రబాబు.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని రెఫరెండంగా తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.. దీనిపై బాబు స్పందించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా కనుమ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్.. ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు చేసిన సవాల్‌కు సిద్ధమని.. సుభాష్ చంద్రబోస్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు 151 సీట్లు అందించారని.. ఇంతలోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనడం చేతగానితనము అన్నారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయమని.. బలహీన వర్గాల ప్రజలు తమతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వైఎస్సార్‌సీపీకి నష్టం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు.

కొద్ది రోజులుగా చంద్రబాబు వైఎస్సార్‌సీపీకి కొత్త సవాల్ విసురుతున్నారు. అధికార పార్టీ 151మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి.. అమరావతి ఎజెండాగా ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఒకవేళ వైఎస్సార్‌సీపీ గెలిస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. బాబు వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు కూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తున్నారు.