బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్ కు యాక్సిడెంట్.

0
29

బాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్ షబానా అజ్మీకి ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్గు‌కురైయింది. ముంబాయి, పూణే ఎక్స్ ‌ప్రెస్ హైవెేలోని కోల్హాపూర్‌లో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదంలో షబానా అజ్మీ‌తో ఆమె భర్త జావేద్ అఖ్తర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు సమాచారం. షబానా అజ్మీ విషయానికొస్తే.. బాలీవుడ్‌లో ఆర్ట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఉత్తమ నటిగా ఐదు జాతీయ చలన చిత్ర పురస్కారాలను అందుకొని రికార్డులు క్రియేట్ చేసింది. ఆమె భర్తే కాదు తండ్రి కైఫ్ అజ్మీకి బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలకు మాటలతో పాటు పాటలను రాసారు. షబానా అజ్మీది స్వస్థలం హైదరాబాద్. ప్రముఖ నటి టబుకు షబానా అజ్మీ స్వయాన మేనత్త. అంతేకాదు ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు ఫర్హాన్ అఖ్తర్‌కు ఈమె సవతి తల్లి. ఈమె రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ రావు హీరోగా నటించిన ‘మార్నింగ్ రాగా’ సినిమాలో ప్రముఖ పాత్రలో నటించింది. షబానా అజ్మీకి యాక్సిడెంట్ విషయం తెలిసి పలువురు ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు. అంతేకాదు వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.