జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాదరావును సస్పెండ్.

0
53

జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాదరావును సస్పెండ్ చేసారు. తన అభీష్టం మేరకు నడుచుకుంటూ.. పార్టీ నిర్ణయాలు కాకుండా సొంత అభిప్రాయాలతో ఉన్నందు వల్ల పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకుంది. రాజధాని మార్పు, రైతు సౌభాగ్య దీక్ష , ఇంగ్లీష్‌ మీడియం గురించి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ పార్టీ క్రమశిక్షణ ఎంతో అవసరమని చెప్పింది. ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారన్న వార్తలతో జనసేన పార్టీలో అలజడి రేగింది. ఎమ్మెల్యే రాపాకతో పాటూ నేతలు షాక్ తిన్నారు. ఇటు సోషల్ మీడియాలో కూడా జనసైనికులు స్పందిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్టు సోషల్ మీడియాలో మల్లా ఒక ఫేక్ ప్రెస్ నోట్ మీడియాలో వైరల్ అవుతోందని.. కావాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై త్వరలో చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు.


ఇదిలాఉండగా కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు జనసేన పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఫేక్ వార్తల్ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాపాకకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ రాపాక మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తూ వచ్చారు. తాను చివరి వరకు జనసేన పార్టీలోనే ఉంటానంటూ చెప్పుకొచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ చాలా సంతోషించారు. ఇదంతా జరుగుతుండగా రాపాక వరప్రసాద్ పైన మళ్ళీ స్థానిక నేతలు, ఆయన అనుచరులు ఒత్తిడి పెంచడం ప్రారంభించారు. జనసేన పార్టీలో ఉంటే ఒరిగేది ఏమీ ఉండదని.. ఆ పార్టీని ఎంత త్వరగా వీడితే అంత మంచిదని చెప్పే ప్రయత్నం చేశారు.