టీడీపీకి ఊహించని షాక్… ఎమ్మెల్యే పదవికి డొక్కా రాజీనామా… కారణం ఏంటి?…

0
36

టీడీపీ పార్టీలో చంద్రబాబుకు మళ్ళీ ఊహించని షాక్ తగిలింది . టీడీపీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్ పదవికి రాజీనామా చేసారు. గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు డొక్కా మాణిక్య వరప్రసాద్‌ దూరంగా ఉంటూ వస్తున్నారు. అమరావతిని మూడు రాజధానులుగా విభజించినందుకు రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇవాళ జరగనున్న మండలి సమావేశానికి డొక్కా గైర్హాజరయ్యారు ఆయన సభకు ఎందుకు రాలేదు అని టీడీపీలో చర్చ జరుగుతుంటే ఇంతలోనే డొక్కా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు.

ఇదిలా ఉంటే … మరో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి కూడా సమావేశాలకు హాజరుకాలేదు. అయితే.. తాను అనారోగ్యం కారణంగానే హాజరుకాలేదని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా సభలో లేకపోవడం కొసమెరుపు. శాసనమండలిలో జగన్మోహన్ రెడ్డి డొక్కాను ఆప్యాయంగా పలకరించారు. డొక్కా కూడా నవ్వుతూ జగన్‌ను కుశలమడిగారు. దీంతో.. డొక్కా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో పత్తిపాడు నుంచి డొక్కా పోటీ చేశారు.

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఏపీ శానససభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లు ఇవాళ శాసనమండలి ముందుకు వచ్చింది. మండలిలో టీడీపీకి సంఖ్యా బలం ఎక్కువ. ఆ పార్టీకి 34మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వైసీపీకి కేవలం 9మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో డొక్కా రాజీనామా చేయడం, శమంతకమణి మండలికి హాజరుకాకపోవడం టీడీపీ శ్రేణులను ఆందోళనలో పడేశాయి. అర్ధాంతరంగా ఇలా రాజీనామా చేయడం ఏంటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారపక్షంతో డొక్కా ఏమైనా ఒప్పందం చేసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా సరికొత్త డ్రామా కాదు కదా అని డౌట్స్ రైజ్ చేస్తున్నారు. కొందరు టీడీపీ ఎమ్మెల్సీలతో మంతనాలు జరిపి తమ వైపు తిప్పుకునేందుకు జగన్ సర్కార్ వ్యూహం రచించినట్లు తెలిసింది. ‘మూడు రాజధానుల బిల్లు’ శాసనమండలిలో వీగిపోకుండా చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.