తమిళంలో ‘అసురన్’ తెలుగు రీమేక్ లో ‘నారప్ప’…

0
33

త‌మిళంలో ధనుష్ హీరోగా సంచ‌ల‌నం సృష్టించ‌న చిత్రం అసుర‌న్‌. ఈసినిమా కులాల ఆధిప‌త్యం, హ‌త్య‌ల నేప‌థ్యంలో రూపొందింది. మ‌ల‌యాళ న‌టి మంజు వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న విష‌యం తెలిపిందే. వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వ‌హిస్తున్నారు.


గ్రామీణ‌ నేప‌థ్యంలో సాగ‌నున్న ఈ చిత్రాన్ని రాయ‌ల‌సీమ అనంత‌పురం నేప‌థ్యంలో రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. అయితే సినిమా టైటిల్ కానీ వెంకీ లుక్ కానీ బయటకు విడుదల చేయలేదు టీమ్. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమాకి నారప్ప నే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మ‌రి అదే టైటిల్ ను ఖాయం చేస్తారా లేదా అనేది తెలియాలి. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయనున్నారు. గత ఏడాది ఎప్‌2, వెంకీమామ చిత్రాలో స‌క్సెస్‌ల‌ను సొంతం చేసుకున్న సీనియ‌ర్ స్టార్ హీరో వెంక‌టేశ్ ఇప్పుడు త‌మిళ చిత్రంతో సకెస్స్ అందుకుంటాడ లేదా అనేది వేచి చూడాల్సిందే. శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. డి.సురేష్‌బాబు, క‌లైపులిథాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పక్కా మాస్ టైటిల్ అయితేనే ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని భావిస్తున్నాడు వెంకటేష్. అందుకే నారప్ప వైపు ఆసక్తి చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది.