విశాఖలో పోలీస్ కారును ఓ వ్యక్తి చోరీ చేశాడు. ఆ కారును పట్టుకునేందుకు రోడ్డు మీద పోలీసులు సినిమా రేంజ్లో ఛేజింగ్ చేశారు. విశాఖ జిల్లా నక్కపల్లి వద్ద కొందరు ర్యాలీ చేపడుతున్నారు. అయితే, వారికి పోలీసులు సర్దిచెప్పేక్రమంలో ఉన్నతాధికారులు ఎలా వ్యవహరించాలో పోలీసులకు సూచిస్తున్నారు. ఈ క్రమంలో పోలీస్ కారును ఓ పక్కన పెట్టి నిరసనకారులు ఉన్న వైపునకు వెళ్లారు. అయితే, కారు డ్రైవర్ తాళాన్ని అక్కడే వదిలి వెళ్లడంతో ఓ యువకుడు ఆ తాళం తీసుకుని కారు స్పీడ్‌గా వేసుకుని వెళ్లిపోయాడు. ఆ హఠాత్పరిణామానికి పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే మరో వాహనంలో ఆ పోలీస్ కారును ఛేజ్ చేశారు. సుమారు 2 కిలోమీటర్ల దూరం సినిమా రేంజ్లో ఈ ఛేజింగ్ సీన్ కొనసాగింది. అయితే, ఆ తర్వాత కారు చోరీ చేసిన వ్యక్తి దాన్ని ఓ కాలువలోకి తీసుకెళ్లి పడేశాడు. వెంటనే పోలీసులు అతడిని పట్టుకున్నారు. కట్ చేస్తే అతడికి మతి స్థిమితం సరిగా తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ‘ఈ పిచ్చోడు కాసేపు చుక్కలు చూపించాడు’ అని పోలీసులు చర్చించుకున్నారు. కారు తాళాలు వాహనంలోనే వదిలి వెళ్లిన డ్రైవర్‌కు పోలీస్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -