టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్న ప్రియాంక సహజానంద.

0
55

ప్రియాంక సహజానంద ఇప్పుడీ పేరు టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. గతేడాది తెలంగాణలో ది బెస్ట్ ఎమర్జింగ్ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా అవార్డ్ పొందిన ప్రియాంక… నిజానికి ఏపీలోని అనంతపురం నుంచీ వచ్చి… హైదరాబాద్‌లో సెటిలైన యువతి. ఓవైపు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ… మరోవైపు… టాలీవుడ్ సెలబ్రిటీలకు… అదిరిపోయే కాస్ట్యూమ్స్ ఇస్తూ… అందరి మెప్పూ పొందుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 2లో వర్క్ చేసిన ప్రియాంక… అప్పట్లోనే… కొంతమంది కంటెస్టెంట్లకు కాస్ట్యూమ్స్ సెట్ చేశారు. అవి నచ్చడంతో… క్రమంగా ఆమె పేరు టాలీవుడ్‌లో అందరికీ చేరింది. చిత్రమేంటంటే… ఇంటర్ తర్వాత విదేశాలకు వెళ్లి… సైకాలజీ కోర్స్ చేసి… ఆ తర్వాత మెడిసిన్ చేసిన ప్రియాంక… తిరిగి ఇండియా వచ్చి… తన వాళ్లను వదిలేసి విదేశాల్లో ఉండటం కష్టమని భావించారు. అందువల్లే ఇండియాలో సెటిల్ అయ్యేందుకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్‌ని ఎంచుకున్నారు. ఇప్పుడు అదే ఫీల్డ్‌లో అద్భుతాలు చేస్తూ… అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు.