ఆస్తుల కేసులో జనవరి 17న ఒక్కసారికి కోర్టు హాజరు నుంచీ మినహాయింపు పొందిన ఏపీ సీఎం జగన్ ఇవాళ అదే కేసు విచారణలో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఐతే… ప్రభుత్వ విధుల వల్ల ఆయన కోర్టుకు హాజరు నుంచి మరోసారి మినహాయింపు పొందారు. ఇందుకు సంబంధించి జగన్ తరపు లాయర్… కోర్టులో వివరణ ఇచ్చారు. జగన్ తరపున… ఇదే కేసులో నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి హాజరైనట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా ఉన్న శ్రీలక్ష్మీ, వీడీ రాజగోపాల్ కోర్టుకు హాజరయ్యారు. సీబీఐ కోర్టు ఈ కేసులో నెక్ట్స్ ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఐతే… జగన్… సీఎం అయినందువల్ల తాను ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం కుదరట్లేదనీ, తాను హాజరైతే… తనకు హైదరాబాద్‌లో భద్రత కల్పించేందుకు చాలా ఖర్చవుతుందనీ… అందువల్ల వ్యక్తిగత హాజరు నుంచీ మినహాయింపు ఇవ్వాలని ఇదివరకు కోర్టును కోరారు. అందుకు సీబీఐ కోర్టు ఒప్పుకోలేదు. ప్రతీ శుక్రవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని తెలిపింది. ఆక్రమంలో… జనవరి 10న కోర్టుకు హాజరైన సీఎం జగన్… జనవరి 17న హాజరు నుంచీ మినహాయింపు కోరారు. అందుకు ఒక్కసారికీ కోర్టు అంగీకరించింది. ఇప్పుడు మరోసారి ఆయన మినహాయింపు పొందినట్లు తెలిసింది. శాసనసభ సమావేశాల దృష్ట్యా జగన్… కోర్టు నుంచీ మినహాయింపు పొందినట్లు తెలిసింది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -