అధికార పార్టీకి ఎదురుదెబ్బ. యాదాద్రి లో కాంగ్రెస్ విజయం…

0
26

తెలంగాణవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతున్నా… యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మాత్రం అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగా ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా… అందులో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత యాదాద్రిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతోంది. అయినా ఇక్కడ కాంగ్రెస్ సభ్యులు మెజార్టీ స్థానాలు గెలుచుకోవడం విశేషం.