ప్రముఖ సీరియల్‌ నటి ‘సెజల్ శర్మ’ ఆత్మహత్య.

0
35

ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. హిందీలో పలు సీరియల్స్‌లో నటించిన మంచి పేరు తెచ్చుకున్న యువ నటి సెజల్ శర్మ. శుక్రవారం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ‘దిల్ తో హ్యాపీ హై జీ’ సీరియల్‌లో సిమ్మి ఖోస్లా పాత్రతో ప్రేక్షక హృదయాల్లో మంచి స్థానం సంపాదించుకున్న ఆమె మరణ వార్త విని హిందీ టీవీ పరిశ్రమ ఉలక్కిపడింది. ఆమెతో పనిచేసిన నటీనటులు ఆమెతో తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఎంతో ధైర్యంగా అందరితో కలిసి పోయే సెజల్ శర్మ.. ఇలా పిరికిగా ఆత్మహత్య చేసుకోవడం మమ్మల్ని ఎంతగానో కలిచివేసిందంటూ తమ ఆవేదన వెలిబుచ్చితున్నారు. అంతేకాదు ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటున్నారు. ఇక సెజల్ ఆత్మహత్య చేసుకుందనే విషయం ఆమె కుటుంబానికి లేటుగా తెలిసింది. ఆమె భౌతిక కాయాన్ని ఆమె స్వస్థలం ఉదయ్‌పూర్‌కు తరలించారు.


2017 నటి అవుదామని ఉదయ్ పూర్ నుంచి ముంబైకి ఎన్నో ఆశలతో వచ్చింది సెజల్. స్టార్ ప్లస్‌లో ప్రసారమవుతున్న ‘దిల్ తో హ్యాపీ హై జీ’ షోతో ఆమె నటిగా మారింది. ఈ సీరియల్‌తో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకోవడంతో పాటు పలు కమర్షియల్ యాడ్స్‌లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో సీరియల్స్‌తో పాటు పలు వెబ్ సిరీస్‌లో కూడా నటించారు.