అసురన్‌తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు ధనుష్. ఆ సినిమా తర్వాత ఆయన నుండి వచ్చిన మరో సినిమా పటాస్. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులో లోకల్ బాయ్ పేరుతో విడుదల కానుంది. తెలుగులో ధనుష్‌కు మంచి మార్కెట్ ఉంది. ఆయన గత సినిమా ‘రఘువరన్ బీటెక్’ తెలుగులో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో ధనుష్ సగటు మధ్యతరగతి యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘మారి’లో లోకల్ డాన్‌గానూ మెప్పించాడు. కాగా ఈ ‘పటాస్’ సినిమాను ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా చేసింది. ఈ భామ ఇంతకు ముందు ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్ 2’, ‘ఎంత మంచివాడవురా’ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పటాస్‌ను లోకల్ బాయ్ పేరుతో తెలుగులో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మాత సీహెచ్ సతీష్‌కుమార్ విడుదల చేస్తున్నాడు. ఫిబ్రవరిలో విడుదలకానుంది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -