రాక్షసుడుగా… డిఫ‌రెంట్‌ లుక్‌తో నాని..

0
35

నాచురల్ స్టార్ నాని, మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో ‘వి’ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబందించి నిన్న సుధీర్ బాబు లుక్‌ విడుదల కాగా ఈరోజు నాని లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో నాని ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపిస్తారు. తాజాగా విడుదల చేసిన లుక్‌లో నాని గడ్డంతో రఫ్ లుక్ లో కనిపిస్తూ… చేతిలో కత్తెర, చేయి మీద నుండి కారుతున్న రక్తంతో అదిరింది. ఈ లుక్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. తన తొలి రెండు చిత్రాల్లో నానిని డిఫ‌రెంట్‌గా చూపించిన డైరెక్ట‌ర్ మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో నాని ఆవిష్క‌రిస్తున్నాడు. ఈ సినిమాలో నాని రాక్షసుడుగా ఉంటే సుధీర్‌బాబు రక్షకుడుగా అలరించనున్నాడు. ఇంతకు ముందు స‌మ్మోహ‌నం వంటి బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీని తెర‌కెక్కించిన మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ఈసారి సుధీర్‌ను ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో చూపిస్తున్నారు. ఈ చిత్రంలో నాని పాత్ర‌కు ధీటుగా ఉండే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టిస్తున్నాడు. ఈ సినిమాను శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. వి సినిమా నాని న‌టిస్తోన్న‌ 25వ చిత్ర‌ం. షూటింగ్ పూర్త‌ి చేసుకున్న ఈ సినిమా ఉగాది సంద‌ర్భంగా మార్చి 25న విడుద‌ల కానుంది.