సినిమాల పై దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ .

0
41

పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పేంటని సీనియర్ నిర్మాత అంబికా కృష్ణ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాలతో హీరోగా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారని, అలాంటి వ్యక్తి మళ్లీ సినిమాల్లో నటిస్తే తప్పేంటని ప్రశ్నించారు. సినిమాలు మానేసి రాజకీయాలు చేయాలని ఎక్కడా లేదంటూ పవర్ స్టార్‌ను వెనకేసుకొచ్చారు. హిందీలో హిట్ అయిన పింక్ సినిమా తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కొన్ని రోజుల క్రితం మొదలైంది. అలాగే, క్రిష్ హీరోగా మరో సినిమాకు కూడా పవన్ కళ్యాణ్ సంతకం చేశాడు. రెండు సినిమాలు చేస్తుండడంతో మరికొందరు నిర్మాతలు కూడా పవర్ స్టార్ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. అంబికా కృష్ణ గతంలో పలు సినిమాలు నిర్మించారు. కొన్నాళ్లు టీడీపీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు.

గత కొన్ని రోజుల క్రితం వరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద బాగా యాక్టివ్‌గా విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లో తిరిగిన పవన్ కళ్యాణ్ బీజేపీతో జట్టుకట్టిన తర్వాత కొంచెం స్పీడ్ తగ్గించారు. సినిమాల మీద దృష్టిపెట్టారు. పార్టీని నడిపించడానికి నిధులు అవసరమని, అందుకే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్లారని ఆయన స్నేహితులు చెబుతున్నారు.