నిర్భయ కేసులో మరో కీలక మలుపు. శిక్ష నుంచి తప్పించుకునేందుకు దోషుల ప్రయత్నం.

0
41

దేశంలో అరనిమిషానికి ఓ రేప్ జరుగుతుంటే… ఎప్పుడో జరిగిన నిర్భయ కేసులో దోషులు నలుగురికీ ఉరిశిక్ష వెయ్యడానికి మన న్యాయ, రాజ్యాంగ వ్యవస్థలు ఆలోచిస్తూ కూర్చుంటున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇవాళ ఉదయమే… ఈ కేసులో దోషిగా ఉన్న వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొట్టివేశారు. అందువల్ల దోషులు నలుగురికీ ఉరి శిక్ష అమలు చేసేందుకు వీలవుతుంది అనుకునేలోపే… దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్… రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ కేసులోని నలుగురు దోషుల్లో… ఇలా పిటిషన్ పెట్టుకున్న మూడో దోషి ఇతడు. ఇప్పటివరకూ రామ్ నాథ్ కోవింద్… ఇద్దరు దోషులు ముఖేష్ సింగ్, వినయ్ శర్మ పిటిషన్లను కొట్టివేశారు.

ఇప్పుడు ఈ పిటిషన్‌పై రాష్ట్రపతి ఫైనల్ నిర్ణయం తీసుకుంటే తప్ప ఉరిశిక్ష అమలు అనేది ముందుకు సాగదు. ఉరిశిక్ష అమలు వాయిదా అంశంపై కోర్టులో దోషుల తరపు లాయర్, తీహార్ జైలు అధికారుల మధ్య వాదనలు జరిగాయి. వినయ్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్ష అమలును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఐతే అతడి ఒక్కడి మెర్సీ పిటిషన్ మాత్రమే పెండింగ్‌లో ఉందని… మిగతా ముగ్గురిని ఉరితీయవచ్చని జైలు అధికారులు వాదించారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. నలుగురి ఉరిశిక్ష అమలుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేయడంతో… నలుగురికీ ఉరిశిక్ష అమలుకు మార్గం ఏర్పడినట్లే. తాజాగా మూడో దోషి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో… పాటియాలా కోర్టు ఎప్పుడు శిక్ష విధిస్తుందో తేలాల్సి ఉంది.