2020లో కేంద్ర బడ్జెట్‌.. పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చిన ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.

0
56

కేంద్ర బడ్జెట్ -2020లో ప్రధాని నరేంద్ర మోదీ హాయంలో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ రెండోసారి బడ్జెట్ ను ఫ్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను ఆశించిన స్థాయిలో ప్రకటించలేదు. కేవలం రైతులకు కార్పొరేట్‌ వర్గాలకు, పన్ను చెల్లింపుదారులకు, డిపాజిటర్లకు, పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఆటోమొబైల్ రంగానికి ముఖ్యమైన ప్రకటనలేమి చేయలేదు. బంగారంపై సుంకం తగ్గించలేదు. పన్ను చెల్లింపుదారులకు ఊరటనిచ్చిన ఆర్థిక మంత్రి రూ. 5లక్షల లోపు ఆదాయం ఉంటే అసలు పన్ను లేదని తీపి కబురు చెప్పారు. 5 నుంచి 7.5 లక్షల వరకు ఆదాయం ఉంటే 10 శాతం ఆదాయ పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 20 శాతం ఉన్నది ఇకపై 10 శాతానికి తగ్గనుంది. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షలు ఆదాయం ఉంటే 15 శాతం పన్ను, 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు 25 శాతం పన్ను, 15 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపారు. అంతేకాదు ఆదాయ పన్ను చెల్లింపుదారులకు 2 అవకాశాలు కల్పించారు. పాత ఐటీ పద్దతిలోనూ లేదా కొత్త ఐటీ పద్దతిలోనూ కొనసాగవచ్చని ప్రకటించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించిన ఆర్థిక మంత్రి.. రైతు సంక్షేమానికి 16 కార్యాచరణ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. 26 లక్షల మంది రైతులకు సోలార్‌ పంపు సెట్లు, ఆరు కోట్ల 11 లక్షల మందికి ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.15లక్షల కోట్లు వ్యవసాయ రుణాల లక్ష్యం. కౌలు భూములకు కొత్త చట్టం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

కార్పోరేట్ వర్గాలకు ఊరటనిచ్చిన నిర్మలా సీతారామన్.. కార్పొరేట్‌ ట్యాక్స్‌ ను 15శాతం తగ్గించారు. కొత్తగా అంతర్జాతీయ బులియన్‌ ఎక్స్చేంజ్‌ ఏర్పాటు, డివిడెండ్‌ డిస్ర్టిబ్యూషన్‌ ట్యాక్స్‌ రద్దు చేశారు.
డిపాజిట్‌ బీమా పరిధి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
ఇక ఎల్ఐసీని ప్రవేటీకరణ చేస్తామని ప్రకటించారు. విద్యా రంగానికి రూ. 99,300 కోట్లు కేటాయిస్తామన్న సీతారామన్ త్వరలో కొత్త విధానం తెస్తామన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతిస్తామన్నారు. 2026నాటికి 150 వర్సిటీల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం కొత్త కోర్సులు, నేషనల్‌ పోలీస్‌, ఫోరెన్సిక్‌ యూనివర్సిటీ ప్రారంభిస్తాం. ప్రస్తుతం ఉన్న ప్రతి జిల్లా ఆస్పత్రికి మెడికల్‌ కాలేజీ అనుసంధానం , కొత్తగా సరస్వతి, సింధు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇక పంచాయితీరాజ్‌కు రూ 1.23 లక్షల కోట్లు, ఆరోగ్య రంగానికి రూ 69,000 కోట్లు, స్వచ్ఛభారత్‌ మిషన్‌కు రూ 12,300 కోట్లు, పైప్‌డ్‌ వాటర్‌ ప్రాజెక్టుకు రూ 3.6 లక్షల కోట్లు, వ్యవసాయ, గ్రామీణాభివృద్ధికి రూ 2.83 లక్షల కోట్లు, కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నేషనల్ టెక్స్ టైల్స్ మిషన్ కు రూ.1480 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య అభివృద్ధికి రూ. 27,300 కోట్లు, రవాణా రంగానికి రూ. 1.70 లక్షల కోట్లు, మహిళా సంక్షేమానికి రూ. 28, 600 కోట్లు, ఎస్టీల అభివృద్ధికి రూ. 53, 700 కోట్లు, ఎస్సీలకు రూ. 85 వేల కోట్లు,
దివ్యాంగులకు రూ. 9,500 కోట్లు, పర్యాటక రంగానికి రూ. 2,500 కోట్లు, సాంస్కృతిక శాఖకు రూ,. 3,150 కోట్లు, క్లీన్ ఎయిర్ పాలసీకి రూ. 4,400 కోట్లు, విద్యుత్ రంగానికి రూ,. 22 వేల కోట్లు కేటాయించారు. పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కాశ్మీరీ కవి దీనానాధ్ కౌల్ రాసిన కవితను చదవి వినిపించారు. నా దేశం దాల్ సరస్సులో విరబూసిన కమలం లాంటిది. నా దేశం సైనికుల నరాల్లో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం. మానవత్వం దయతో కూడిన సమాజం అవసరం. నా దేశం వికసిస్తున్న షాలిమార్ తోటలాంటిది’ అంటూ ఆ కవితకు అర్థాన్ని వివరించారు. సందర్భంగా తమిళంలో కథ చెప్పారు నిర్మలా సీతారామన్.