అడోబ్ ఐటీ సంస్థల సీఈవోలు ఇండియాకి చెందిన వారే కావడం విశేషం.వీటిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగువాడైన సత్యనాదెళ్ళ ఉన్నారు.ఆయన బాద్యతలు తీసుకున్న తర్వాత సంస్థలో లాభాలబాటలో నడిపిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం సీఈవోగా తెలుగు వ్యక్తి ఎంపికయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన అరవింద్ కృష్ణకి పదవీ బాద్యతలు స్వీకరించబోతున్నారు. ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అర్వింద్ కృష్ణను ఎంపిక చేసినట్లు ఆ కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న గిన్నీ రొమెట్టీ త్వరలో ఆ పదవి నుంచి వైదొలుగుతారు.ఐబీఎంతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉన్న ఆమె రిటైర్మెంట్ తర్వాత. ఏప్రిల్ 6న అర్వింద్ కృష్ణ బాధ్యతలు చేపడతారు.30 ఏళ్ల క్రితం ఐబీఎంలో చేరిన అర్వింద్ కృష్ణ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆ కంపెనీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన కొనసాగుతున్నారు.ఐబీఎం రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌ను ఆయనే లీడ్ చేస్తున్నారు.అరవింద్ కృష్ణ ఎంపిక కావడంపై ఆయన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరిలోని ఆయన స్వగ్రామంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఓ పెద్ద ఐటీ కంపెనీ సీఈవో కావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పుకుంటున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -