ఐబీఎం కొత్త సీఈవోగా అర్వింద్ కృష్ణ.

0
39

అడోబ్ ఐటీ సంస్థల సీఈవోలు ఇండియాకి చెందిన వారే కావడం విశేషం.వీటిలో మైక్రోసాఫ్ట్ సీఈవోగా తెలుగువాడైన సత్యనాదెళ్ళ ఉన్నారు.ఆయన బాద్యతలు తీసుకున్న తర్వాత సంస్థలో లాభాలబాటలో నడిపిస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఐటీ దిగ్గజ కంపెనీ ఐబీఎం సీఈవోగా తెలుగు వ్యక్తి ఎంపికయ్యాడు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన అరవింద్ కృష్ణకి పదవీ బాద్యతలు స్వీకరించబోతున్నారు. ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అర్వింద్ కృష్ణను ఎంపిక చేసినట్లు ఆ కంపెనీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్న గిన్నీ రొమెట్టీ త్వరలో ఆ పదవి నుంచి వైదొలుగుతారు.ఐబీఎంతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉన్న ఆమె రిటైర్మెంట్ తర్వాత. ఏప్రిల్ 6న అర్వింద్ కృష్ణ బాధ్యతలు చేపడతారు.30 ఏళ్ల క్రితం ఐబీఎంలో చేరిన అర్వింద్ కృష్ణ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రస్తుతం ఆ కంపెనీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన కొనసాగుతున్నారు.ఐబీఎం రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌ను ఆయనే లీడ్ చేస్తున్నారు.అరవింద్ కృష్ణ ఎంపిక కావడంపై ఆయన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరిలోని ఆయన స్వగ్రామంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమ గ్రామానికి చెందిన వ్యక్తి ఓ పెద్ద ఐటీ కంపెనీ సీఈవో కావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పుకుంటున్నారు.