ఎమోషనల్ లవ్ స్టోరీతో సమంత.

0
53

96.. ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో కూడా బాగా వినిపించిన పేరు ఇది. తమిళనాట క్లాసిక్ అనిపించుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసాడు దిల్ రాజు. చాలా నచ్చి చేసిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అలరించింది.. శర్వా, సమంత జోడీ బాగా నటించారా లేదా..
రామ్ ఉరఫ్ కే రామచంద్ర (శర్వానంద్) ఓ ట్రావెల్ ఫోటోగ్రఫర్. తన ఫోటోగ్రఫీ స్టూడెంట్స్‌తో కలిసి అనుకోకుండా తన స్కూల్ దగ్గరికి వెళ్తాడు. పాత జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చి మరోసారి రీ యూనియన్ ప్లాన్ చేసుకుంటారు 2004 బ్యాచ్. దానికి అంతా వస్తారు.. జానకి దేవి (సమంత) తో సహా. స్కూల్ డేస్‌లో వదిలేసిన ప్రేమకథను అక్కడ మళ్లీ గుర్తు చేసుకుంటారు జాను, రామ్. అయితే అంతగా ప్రేమించుకున్న జాను, రామ్ ఎందుకు విడిపోయారు.. అసలు వాళ్ల మధ్య ఏం జరిగింది.. 15 ఏళ్ళ తర్వాత ఏం చేసారు అనేది అసలు కథ..కథనం:


రెండేళ్ల కింద తమిళనాట వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం అక్కడ క్లాసిక్ అనిపించుకుంది. ఈ సినిమా బాగా నచ్చి విడుదలకు ముందు రైట్స్ తీసుకున్నాడు దిల్ రాజు. ఇప్పుడు జానుగా రీమేక్ చేసాడు. అదే దర్శకుడు చేయడంతో తెలుగులో కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా సమంత, శర్వానంద్ లాంటి క్యాస్ట్ ఉండటం కూడా సినిమాకు కలిసొచ్చింది. జాను రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు.. పాటలు ఫైట్స్ ఉండవు.. అన్నీ సిచ్యువేషనల్‌గా వచ్చే పాటలు.. కామెడీ సన్నివేశాలే. ఎక్కడా పక్కదారి పట్టకుండా తనేం అనుకున్నాడో.. అదే తెరపై చూపించాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. దానికి ఆయన్ని బాగా మెచ్చుకోవాలి.. ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రేమ్. సమంత, శర్వానంద్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా స్కూల్ ప్రేమకథతో పాటు శర్వా, సమంత రీ యూనియన్ కూడా బాగుంది. అయితే స్లో నెరేషన్ ఈ చిత్రానికి మైనస్ అవుతుంది. తమిళనాట 96 కి ఎందుకు అంతగా కనెక్ట్ అయ్యారో అర్థం కాలేదు కానీ నిజానికి ఇది మామూలు కథే.