హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్డులో దారుణం చోటుచేసుకుంది. ఎప్పుడూ సందడిగా ఉండే ఆ ప్రాంతం లో సినిమా థియేటర్ల వల్ల ఎక్కువ మంది యువత అక్కడకు వెళ్తుంటారు. అదీకాక కొత్త సినిమా రిలీజైతే… అక్కడి థియేటర్లలో ఫ్యాన్స్‌తో కలిసి సినిమాలు చూస్తుంటారు టాలీవుడ్ ప్రముఖులు. అలాంటి చోట జరిగిన విషాదం ఇది. లారీ చేసిన బీభత్సానికి, విద్యార్థులపైకి అది దూసుకుపోవడందతో… అక్కడికక్కడే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బైక్ పై వెళ్తున్న విద్యార్థులపైకి లారీ దూసుకెళ్లడంతో… ఇద్దరు విద్యార్థులు బైక్ పై నుంచీ కింద పడిపోయారు. బలమైన గాయాలు తగిలి, రక్తం కారి… ఇద్దరూ ప్రాణాలు విడిచారు. మృతదేహాల్ని అక్కడి నుంచీ పోస్ట్ మార్టం కోసం తరలించిన పోలీసులు… ఆ విద్యార్థులు ఎవరు, ఎక్కడి నుంచీ, ఎక్కడికి వెళ్తున్నారు అనే వివరాలు తెలుసుకుంటున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. బ్రేక్ ఫెయిలవ్వడం వల్లే లారీ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఘటన… స్థానికుల్ని విషాదంలో ముంచేసింది.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -